గుంటూరు

యువత ఆధ్యాత్మికత పెంచుకోవాలి

చీరాల : యువతీ యువకులు చెడుతనాన్ని విడనాడి చదువుతోపాటు ఆధ్యాత్మికత పెంచుకోవాలని... పెద్దలు, గురువులను గౌరవించాలని ఆంధ్ర ఇవాంజిలికల్‌ లూధరన్‌ సంఘం గుంటూరు హెడ్‌ క్వార్టర్‌ (ఎఇఎల్‌సి) అధ్యకక్షుడు మోటరేటర్‌ బిషప్‌ కె.ఎఫ్‌.పరదేశిబాబు అన్నారు. స్థానిక చర్చి కాంపౌండ్‌లోని సెయ్‌ిం మార్క్స్‌ సిెంనరీ లూధరన్‌ చర్చి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన స్ట్‌ేవైడ్‌ యూత్‌ కన్వెన్షన్‌-2016 బుధవారంతో ముగిసింది. స్థానిక చర్చి పాస్టర్‌ రెవ.వేములబాబు సర్వోన్నతరావు మ్లాడుతూ రాష్ట్రస్థాయిలో 2 వేల మంది యువత పాల్గొనడం శుభపరిణామమన్నారు. చర్చి ఛైర్మన్‌ దేట అశోక్‌ కుమార్‌, ట్రెజరర్‌ జ్యోతుల జాకబ్‌లు మ్లాడుతూ 2003లో నిలిచిన యూత్‌ కన్వెన్షన్‌ క్యాంపు తిరిగి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

ఉత్సాహంగా... రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ఆంధ్ర ఇవాంజిలికల్‌ లూధరన్‌ సంఘం (ఎఇఎల్‌సి) లోని 69 లూధరన్‌ చర్చిల నుంచి పాస్టర్లు కూడా హాజరయ్యారు. బైబిల్‌లోని సారాంశాలను విశదీకరించి పాఠ్యాంశాలుగా బోధించారు. బైబిల్‌ క్విజ్‌, పాటలు పోీలు నిర్వహించారు. దేవుని గీతాలకు చేసిన నృత్యాలు అలరించాయి. క్యాంపు చివరిరోజు ముగింపు సందర్భంగా సెయ్‌ిం మార్క్స్‌ లూధరన్‌ జూనియర్‌ కాలేజి క్రీడా మైదానంలో క్యాంప్‌ఫెయిర్‌ నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. పోీల్లో విజేతలకు బిషప్‌ పరదేశిబాబు బహుమతులను అందజేశారు. ఎఇఎల్‌సి సెక్రటరీ సిహెచ్‌.కిశోర్‌బాబు, ఎఇఎల్‌సి యూత్‌ డైరెక్టర్‌ రెవ.జి.సతీష్‌, కె.ఆశాకిరణ్‌, పరదేశిబాబు, ఎఇఎల్‌సి మాజీ అధ్యకక్షుడు రెవ.విక్టర్‌ మోజెస్‌, స్థానిక చర్చి అడిషనల్‌ పాస్టర్‌ రెవ.జి.చంద్రకాంత్‌, స్థానిక చర్చియూత్‌ ప్రెసిడ్‌ెం డి.సుధీర్‌, చర్చి ఎల్‌సిసి, పిసిసి సభ్యులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 




తాజా వార్తలు