పశ్చిమగోదావరి

కల్వరి మహోత్సవాలు

ఏలూరు : ప్రపంచంలో శాంతి, సామరస్యం కోసం నిరంతరం ప్రార్ధనలు జరపాల్సిన ఆవశ్యకత ఉందని ప్రముఖ క్రైస్తవ ప్రసంగీకులు పి.సతీష్‌కుమార్‌ చెప్పారు. అక్టోబర్‌ 10 నుంచి ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం ఆవరణలో కల్వరి మహక్షత్సవాల్లో సతీష్‌కుమార్‌ సువార్త సందేశాన్ని వినిపించారు. మనిషిగా ప్టుిన ప్రతిఒక్కరూ పాపంలోనే జీవిస్తున్నారని చెప్పారు. చేసిన తప్పులను దేవుని యందు అంగీకరించి ఆయనలో జీవించాలని ప్రబోధించారు. ప్రపంచంలో శాంతి, సామరస్యం తరిగిపోతున్న తరుణంలో ఒకరిపట్ల ఒకరు ప్రేమ, దయ, కరుణ, ఆప్యాయత కలిగి జీవించాల్సిన అవసరం ఉందన్నారు. నిత్యం ప్రార్ధనలో గడపడం, చేసిన పాపాలను ఒప్పుకోవడం, దేవుని పది ఆజ్ఞలను ఆచరించడం ద్వారా జీవితాన్ని సార్ధకం చేసుకోవచ్చన్నారు. అనంతరం ఆయన రచించి స్వరపరచిన క్రైస్తవ భక్తిగీతాలను ఆలపించారు. కార్యక్రమంలో ఏటూరు కన్వీనర్లు పాస్టర్‌ జ్యోతిరాజు, మాజీ మేయర్‌ కారే బాబూరావు, నిర్వాహకులు సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు