పశ్చిమగోదావరి

క్రీస్తు మార్గంలో పయనించాలి

లింగంపాలెం : క్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తే పరలోక ప్రాప్తి కలుగుతుందని ఆయన మార్గాన్ని ఆందరూ అనుసరించాలని సినీని దివ్యవాణి పిలుపునిచ్చారు. భోగోలు గ్రామంలోని అక్టోబర్‌ 6వ తేదీన ఇమాన్యేలు ఐసిఎం చర్చిలో నిర్వహించిన స్త్రీలమైత్రి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. క్రీస్తు బిడ్డలుగా మనందరం విశ్వాసులుగాను, విధేయతగాను ఉండాలన్నారు. క్రీస్తుమార్గం ప్రస్తుత సమాజాన్ని సన్మార్గంలో పయనింపజేయానికి బహు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రతి స్త్రీ దేవుని యందు ప్రేమాభిమానాలు కల్గి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిఎం బిషప్‌ సతీమణి రోజీజాన్‌, వైఎస్సార్‌ సిపి చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు, సతీమణి శాంతికళ, స్థానిక పాస్టర్స్‌, సంఘపెద్దలు, అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు