అంతర్జాతీయం

జెరూసలెంలో ఆగంతకుడి కాల్పులు

జెరూసలెం : జెరూసలెంలో అక్టోబర్‌ 9వ తేదీన ఓ ఆగంతకుడు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ దుండగుడిని కాల్చి చంపారు. గాయపడిన ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాడి జరిగిన ప్రదేశం పోలీసుల ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉంది. అత్యధికమంది యూదులు ఉత్తర భాగంలో నివసిస్తుాంరు. ఆ ప్రదేశంలో చిన్న రైల్వేస్టేషన్‌ కూడా ఉంది. నిందితుడు కాల్పుల అనంతరం పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వెంబడించి అతడిని కాల్చి చంపారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులపై కూడా కాల్పులకు తెగబడ్డాడు. ఇీవల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన హింసలో దాదాపు 231 మంది పాలస్తీనా ప్రజలు, 34 మంది ఇజ్రాయిల్‌ వాసులు, ఇద్దరు అమెరికన్లు, ఒక సూడాన్‌, జోర్దాన్‌ వాసి మృతి చెందారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు