మెదక్ జిల్లాకు చార్లెస్ పేరు ప్టోలి
అడ్డగుట్ట : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల ప్రక్రియలో మెదక్ జిల్లాకు చార్లెస్ పేరు ప్టోలని ఆల్ ఇండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరుసలేం మత్తయ్య ప్రభుత్వానికి డిమాండు చేశారు. అక్టోబర్ 7వ తేదీన సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మ్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం నుంచి తెలంగాణ అభివృద్ధిలో మిషనరీలు చేసిన కృషి అమోఘమని, మెదక్ చర్చికి ఉండే ప్రాధాన్యం దృష్ట్యా ఆ జిల్లాకు చార్లెస్ పేరు ప్టోలని డిమాండు చేశారు. మల్కాజగిరి జిల్లాకు మదర్ థెరిస్సా లేదంటే మార్టిన్ లూధర్ కింగ్‌ల పేరును ప్టోలని కోరారు. నిరక్షరాస్యులుగా ఉన్న తాండూరు, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాల్లో ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఫాదర్ గార్డెన్ దొర పేరును ప్టోలని, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపిల సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. మీడియా సమావేశంలో తెలంగాణ క్రైస్తవ సేన వ్యవస్థాపక అధ్యకక్షుడు నాగల్ల పోచయ్య పాల్గొన్నారు.
తాజా వీడియోలు
తాజా వార్తలు