పశ్చిమగోదావరి

క్రైస్తవులపై దాడులు తగదు

- దళిత సంఘాలు, వామపక్షాల నిరసన

జంగారెడ్డిగూడెం :
క్రైస్తవులు, చర్చలపై దాడులను అరిక్టాలని అలుగు ఆనంథేఖర్‌ అన్నారు. దళిత సంఘాలు, వామపక్షాలు, పాస్టర్స్‌ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 10వ తేదీన భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మ్లాడుతూ మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. క్రైస్తవ విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసే ప్రచారాలను ఖండించారు. ఇంిగ్రేటెడ్‌ కౌన్సిల్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఎం.డేవిడ్‌ మ్లాడుతూ క్రైస్తవులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. ిడిపి క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యకక్షుడు బాలిన సత్యనారాయణ మ్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్‌ మైనార్టిలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కె.ప్రభాకరరావు మ్లాడుతూ క్రైస్తవ ధర్మాన్ని అవమానించడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. మోహన్‌ మ్లాడుతూ క్రైస్తవులపై దాడుల వెనుక కుట్ర దాగుందని క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం ర్యాలీగా వెళ్ళి ఆర్డివొ ఎస్‌.లవన్న, డిఎస్పి జె.వెంకావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఊబా సూర్యప్రకాశ్‌, పి.రామకృష్ణ, బర్రే వెంకటేశ్వరరావు, జక్కంశ్టెి సత్యనారాయణ, బేతాళ శ్రీనివాస్‌, మల్లవరపు సత్యనారాయణ, వి.శ్యాంబాబు, దేవప్రియం, భూషణం, జార్జి ముల్లర్‌, జోసఫ్‌, చలపతిరావు, బాపూజీ, జైపాల్‌, సురేష్‌, పాల్‌ కుమార్‌, లోకేష్‌, కిషోర్‌ కుమారి, శ్రీనివాస్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

క్రైస్తవ సంఘాల నిరసన : క్రైస్తవులపై దాడులకు నిరసిస్తూ క్రిస్టియన్‌ ఫెడరేషన్‌, ఎపి క్రిస్టియన్‌ సోషల్‌ ఫోరం అక్టోబర్‌ 10వ తేదీన అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సిఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎస్‌ఎస్‌ఎస్‌ గాంధి తెలిపారు. జాతీయ సలహాదారు కె.ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మతపరమైన ఘర్షణలకు దారి తీసే మెసేజ్‌లను సోషల్‌ మీడియా ద్వారా వ్యాప్తి చేసే పనులను మానుకోవాలని పలువురు పేర్కొన్నారు. రాజమండ్రిలో నవంబర్‌ 14న జరగబోయే దళిత క్రైస్తవ గర్జనకు వేలాదిగా దళితులు, అభిమానులు తరలి రావాలన్నారు. శ్రీమంతు జార్జి, శ్రావణ్‌కుమార్‌, సంజీవరావు, రాజు, జయపాల్‌, చ్టిబాబు తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు