పశ్చిమగోదావరి

క్రైస్తవ్యాన్ని కించపరచిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి : పాస్టర్లు

బ్టుాయిగూడెం : క్రైస్తవ మతాన్ని, క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా అసభ్య పదజాలంతో దూషించిన వెలగా మాధవరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల పాస్టర్ల అసోసియేషన్‌ భారీ మోారు సైకిల్‌ ర్యాలీ అక్టోబర్‌ 10వ తేదీన నిర్వహించారు. స్థానిక లూధరన్‌ చర్చి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం తహసీల్దార్‌ చిన్నికృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జార్జి ముల్లర్‌, జోసఫ్‌ మ్లాడుతూ మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా మాధవరావు వ్యవహరించారని, ఇది క్షమించరాని నేరమన్నారు. ఇటువిం ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్ష, కార్యదర్శులు ఊబా సూర్యప్రకాశరావు, మానుకొండ సోంబాబు, కోండ్రు కార్తీక్‌, పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు. అనంతరం డివిజన్‌ స్థాయిలో జంగారెడ్డిగూడెంలో జరిగే శాంతి ర్యాలీకి తరలి వెళ్ళారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు