క్రిష్ణ

సమాచారం లేకుండా చర్చి కూల్చడం దారుణం

గుణదల : ముందస్తు సమాచారం లేకుండా చర్చిని కూల్చడం దారుణమని మేరీమాత పుణ్యక్షేత్రం ఇన్‌ఛార్జ్‌ రెక్టర్‌ మువ్వల ప్రసాద్‌ అన్నారు. గుణదల దళితవాడలో చర్చిని రోడ్డు విస్తరణ నిమిత్తం అధికారులు అక్టోబర్‌ 11వ తేది అర్ధరాత్రి కూల్చేశారు. దీన్ని ఖండిస్తూ క్రిస్టియన్‌ సంఘాలు, దళితవాడవాసులు చర్చి కూల్చిన ప్రదేశంలో అక్టోబర్‌ 12వ తేదీన ధర్నా చేశారు. మేరీమాత పుణ్యక్షేత్రం ఇన్‌ఛార్జ్‌ రెక్టర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌ మ్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి క్రిస్టియన్‌ సంఘాలు ఆటంకం కాదన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే చర్చి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేయించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం ఇస్తే చర్చిలో మేరీమాత ప్రతిమను, సామగ్రిని భద్రపరచుకునే అవకాశం ఉండేదన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు