పశ్చిమగోదావరి

విశ్వాస ప్రార్ధనలతో విజయం

నల్లజర్ల : ఉపవాస ప్రార్ధన విశ్వాసులకు విజయాన్ని చేకూర్చుతుందని స్వ-సంపూర్ణ చర్చి పాస్టర్‌ విజయబాబు అన్నారు. చీపురుగూడెంలోని స్వ-సంపూర్ణ ఆలయంలో ఉపవాస ప్రార్ధనలు మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. ముగింపు సభలో పాస్టర్‌ విజయబాబు మ్లాడుతూ ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు ప్రార్ధన చేయాలన్నారు. అనంతరం తాడేపల్లిగూడెం నుండి వచ్చిన పాస్టర్‌ బన్‌హోం, కాకినాడ నుండి వచ్చిన పాస్టర్‌ బెన్నిలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంఘపెద్దలు చెల్లు పుల్లారావు, కంపన సుబ్బారావు, చెల్లు వీర్రాజు, చెల్లు రంగారావు, మోదుగ సుబ్బారావు, ఆంజనేయులు, వసంతాడ మధు, నీలం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు