గుంటూరు

కీస్తు మార్గం అత్యున్నతమైనది

పెదకాకాని : క్రీస్తు మార్గం అత్యున్నతమైందని, ఆయన ఆజ్ఞలను ఆచరించడమే దేవుని ప్రేమించడమని కాకాని స్వస్థిశాల నిర్వాహకులు, బైబిల్‌ మిషన్‌ ఉపాధ్యకక్షుడు డాక్టర్‌ జె.సామ్యుల్‌ కిరణ్‌ తెలిపారు. పెదకాకాని స్వస్థిశాలలో రెండు రోజుల పాటు జరిగిన యువకుల ప్రార్ధనా సదస్సు అక్టోబర్‌ 12వ తేదీతో ముగిసింది. ఈ సందర్భంగా శామ్యుల్‌ కిరణ్‌ మ్లాడుతూ ప్రపంచ శాంతి కోసం క్రైస్తవ యువత ప్రార్ధనలు జరిపించాలన్నారు. యువ క్రైస్తవులు ఆత్మీయ బలంతో ఎదగాలని సూచించారు. ప్రపంచంలో నానాికి శాంతికి విఘాతం కలుగుతుందని అభద్రతా వాతావరణం నెలకొంటుందన్నారు. ఈ తరుణంలో యువత ప్రపంచ శాంతిని ఆకాంక్షించాలని తెలిపారు. దేశ, దైవ భక్తిలో సైనికుల్లా ఎదగాలని సూచించారు. ఆత్మీయబలంతోనే యువ క్రైస్తవులు క్రీస్తు మార్గంలో పయనించగలరన్నారు. పరిశుద్ధ ఆత్మ శక్తితో ప్రపంచమంతిని సువార్త చేయుటకు యువత ముందుండాలన్నారు. దేవుడు, దేశానికి అమితమైన సేవలు అందించడానికి యువత నడుం బిగించాలని తెలిపారు. అనుదినం బైబిల్‌ పఠనం అలవర్చుకుంటేనే జీవితంలో అద్భుతాలు సాధించవచ్చన్నారు. తెలుగు బైబిల్‌తో పాటు ఆంగ్ల భాషలో ఉన్న బైబిల్‌ చదవడం వల్ల పలు ప్రాంతాల్లో క్రీస్తు సందేశాన్ని అందించవచ్చని తెలిపారు. సదస్సులో బైబిల్‌ మిషన్‌ అధ్యకక్షుడు డాక్టర్‌ సత్యానందం, సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ ఏసురత్నం, గవర్నింగ్‌ బాడీ సభ్యులు డాక్టర్‌ షారోన్‌ కుమార్‌, జాన్‌ దేవదాస్‌, డాక్టర్‌ దినకర్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు