రాష్ట్రీయం

సీమాంధ్రలో స్కూళ్లకు సెలవుల్లేవు!

పాఠశాలలకు ఈసారి క్రిస్‌మస్, సంక్రాంతి సెలవులు ప్రాంతాల వారీగా వేరువేరుగా ఉండబోతున్నాయి. సీమాంధ్రలోక్రిస్‌మస్, సంక్రాంతి సెలవులు రద్దుకాగా, తెలంగాణలో డిసెంబర్ 24 నుంచి క్రిస్‌మస్ సెలవులు ఉంటాయి.సీమాంధ్రలో మాత్రం క్రిస్టియన్  మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 25న (క్రిస్‌మస్ రోజున) మాత్రమే సెలవు ఇస్తారు.మిగతా రోజుల్లో స్కూళ్లు పనిచేస్తాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక నాన్ మిషనరీ స్కూళ్లకు జనవరి 8 నుంచి 17 వరకు ఇచ్చే సంక్రాంతి సెలవులను కూడా సీమాంధ్రలో ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం పండుగ రోజే సెలవు ఉంటుంది. తెలంగాణ జిల్లాల్లో మాత్రం క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు క్రిస్‌మస్ సెలవులు, మిగతా స్కూళ్లకు సంక్రాంతి సెలవులు యథావిధిగా వర్తిస్తాయని విద్యాశాఖ తెలిపింది. సమ్మెకాలాన్ని పనిదినాలుగా సర్దుబాటు చేయడంతో సీమాంధ్రలో సెలవులు రద్దయ్యాయని విద్యాశాఖ పేర్కొంది


 తాజా వీడియోలు 




తాజా వార్తలు