గుంటూరు

రూ.10 కోట్లతో క్రిస్టియన్‌ భవన్‌ : పల్లె

అమరావతి : మైనారిీల సంక్షేమం కోసం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబునాయుడు రూ.710 కోట్లను కేయించారని మైనారిీ సంక్షేమశాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి చెప్పారు. మైనారిీ విద్యార్ధుల విదేశీ విద్య కోసం ఒక్కో విద్యార్ధికి రూ.10 లక్షల ఆర్ధికసాయం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో జెరూసలెం యాత్రను విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి అక్టోబర్‌ 4వ తేదీన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్లాడుతూ గుంటూరులో రూ.10 కోట్లతో క్రిస్టియన్‌ భవన నిర్మాణాన్ని ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పారు. జెరూసలెం యాత్రకు వెళుతున్న 48 మంది సురక్షితంగా తిరిగిరావాలని మంత్రి ఆకాంక్షించారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, మైనారిీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉషా తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు