క్రిష్ణ

నవంబర్‌ 14న దళిత క్రైస్తవ గర్జన

విజయవాడ : దళిత క్రైస్తవులకు ఎస్సి హోదా కల్పించాలనే డిమాండ్‌తో నవంబర్‌ 14న రాజమండ్రిలో దళిత క్రైస్తవ గర్జన నిర్వహిస్తున్నట్లు ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యకక్షుడు జి.విజయరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సెప్టెంబర్‌ 22వ తేదీన కలసి ఆహ్వానించామని చెప్పారు. దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి దళిత క్రైస్తవులు తరలి రావాలన్నారు. నవంబర్‌ 14న రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాలలో మధ్యాహ్నం 3 గం||ల నుండి గర్జన జరుగనుందన్నారు. సి.ఎం.ను ఆహ్వానించిన వారిలో ఫెడరేషన్‌ ఎ.పి.రాష్ట్ర అధ్యకక్షులు జార్జి శ్రీమంతులు, కార్యదర్శి జాన్‌ డానియేల్‌, మార్టిన్‌ శాంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు