అంతర్జాతీయం

మరణించి 3 వందల ఏళ్లు.... ఇప్పుడు తెరిచింది కళ్లు!

- యు ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న వీడియో

మెక్సికో :
ఎప్పుడో మూడువందల ఏళ్ల క్రితం మరణించినట్లుగా చెబుతున్న మహిమాన్వితగా పేర్కొనే ఓ క్రైస్తవ చిన్నారి పార్ధివదేహం అద్దాల పెట్టెలో నేికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇక్కడి జెలిస్కో ప్రాంతంలోని ఓ చర్చిలో ఉన్న 'సెయ్‌ిం ఇన్నొసెన్స్‌' మృతదేహం హఠాత్తుగా కళ్లు తెరచి చూసిందనే వార్త ఇప్పుడు మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యుట్యూబ్‌లో ఉంచిన ఆ ఫుటేజ్‌ని చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. లక్షల పర్యాయాలు చూసినట్లు తెలుస్తోంది. ఇదంతా భ్రమ అని క్టొిపారేసే వారు కొందరైతే... ఏమో ఇది దేనికి సంకేతమో! అంటూ ఆశ్చర్యపోతున్న వారెందరో. దాదాపు 3 వందల ఏళ్ళ నుంచి మైనంతో చేసే ఒక ప్రక్రియతో ఆ భౌతికకాయాన్ని పరిరక్షిస్తున్నారు. చర్చి అందచందాలను మిస్‌ ఇన్నోసెన్స్‌ శవపిేకను తన కెమెరాలో బంధిస్తుండగా ఆమె ఒక్కసారిగా కళ్ళు తెరచినట్టు కనిపించిందని పేర్కొంటూ ఒక పర్యాటకుడు యుట్యూబ్‌లో వీడియోను ఉంచారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు