అంతర్జాతీయం

గహాంతరవాసుల జోలి మనకొద్దు

లండన్‌ : గ్రహాంతరవాసులతో సంబంధం కోసం తొందరపడవద్దని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ హెచ్చరించారు. ఇతర గ్రహాల్లోని జీవులకు ముఖ్యంగా మనకన్నా సాంకేతికంగా ముందున్న జాతులకు మన ఉనికి గురించి తెలియనివ్వవద్దని సూచించారు. క్రిస్టోఫర్‌ కొలంబస్‌ తొలిసారి రెడ్‌ ఇండియన్స్‌కు తారసపడినప్పుడు ఎదురైన పరిస్థితుల తరహాలో గ్రహాంతరవాసులతో ముఖాముఖీ ఉంటుందని హాకింగ్‌ హెచ్చరించారు. 'స్టీఫెన్‌ హాకింగ్స్‌ ఫేవర్‌ే ప్లేసెస్‌' పేరుతో కొత్తగా విడుదలైన ఆన్‌లైన్‌ చిత్రంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. ఈ చిత్రంలో 'ఎస్‌ఎస్‌ హాకింగ్‌' అనే ఊహాజనిత వ్యోమనౌకలో విశ్వంలోని వివిధ ప్రదేశాలకు ప్రయాణిస్తూ విశ్వంలోని ఐదు ముఖ్యమైన ప్రదేశాలను చూపారు. భూమికి 16 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్లీసీ 832సి అనే గ్రహానికి చేరువగా వెళ్లినట్లు చూపారు. ఈ గ్రహంపై ఆవాసయోగ్య పరిస్థితులు ఉన్నాయి. 'ఇలాిం గ్రహం నుంచి ఏదో ఒకరోజు మనం సంకేతాన్ని అందుకునే అవకాశం ఉంది. అయితే దానికి సమాధానం ఇచ్చే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ గ్రహవాసులు చాలా శక్తిమంతులై ఉండొచ్చు. మనల్ని చులకనగా చూడొచ్చు' అని హెచ్చరించారు. భూమికి వెలుపల విశ్వంలో ఎక్కడో ఒకచోట జీవం ఉంటుందన్నది తన గ్టి నమ్మకమని తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు