నెల్లూర్

విజయవంతంగా జరిగిన నెల్లూరు ఎఐసిసి లీడర్స్‌ కాన్ఫరెన్స్‌

నెల్లూరు : సెప్టెంబర్‌ 19వ తేదీన నెల్లూరు ౌన్‌ హాల్‌నందు జరిగిన ఎఐసిసి నెల్లూరుజిల్లా సర్వసభ్య సమావేశం ఘనముగా జరిగింది. స్థానిక జిల్లా నాయకులు ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎఐసిసి ప్రెసిడ్‌ెం రెవ.డా||జి.వి.ప్రసాదరావు, రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ రెవ.డా||రైమో జుహాని హలోనెన్‌, జనరల్‌ సెక్రటరీ రెవ.గంజి ఎజ్రా పాల్గొనగా, స్థానిక రాజకీయ ప్రముఖులు ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యె, శ్రీధర్‌ కృష్ణారెడ్డి మాజి ఎమ్మెల్యె, స్థానిక నెల్లూరు నగరమేయరు అబ్దుల్‌ అజీజ్‌ తదితర క్రైస్తవ ప్రముఖులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఎఐసిసి రాష్ట్ర అధ్యకక్షులు రెవ.జి.వి.ప్రసాదరావు మ్లాడుతూ క్రైస్తవ శ్రేయస్సు కొరకు ప్రభుత్వాలు పాటుపడాలని, ప్రభుత్వాల కొరకు క్రైస్తవులు నిత్యం ప్రార్ధిస్తున్నారనే విషయాన్ని గమనించాలని కోరారు. రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ రెవ.రైమో జుహాని హలోనెన్‌ వాక్య సందేశాన్ని అందించారు. అనంతరం ఆనం వివేకానందరెడ్డి మ్లాడుతూ క్రైస్తవులు దేవుని వైపు చూడాలి, ఆయనను అడిగి ఆయనకు మాత్రమే దాసులుగా ఉండాలని అన్నారు. శ్రీధర్‌ కృష్ణారెడ్డి మరియు జిల్లా క్రైస్తవ ప్రముఖులు తమ గ్రీింగ్స్‌ను తెలియచేశారు. స్థానిక నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ చివరిగా పాల్గొని నెల్లూరు నగరంలో క్రైస్తవుల బరియల్‌ గ్రౌండ్‌కు 5 ఎకరాల స్థలాన్ని కేయించి తీర్మానాన్ని ఆమోదించాము అని తెలియచేయడంతో దేవుడు చేసిన ఈ మేలును బ్టి ౌన్‌హాల్‌ మారుమ్రోగేలా కరతాళ ధ్వనులతో క్రైస్తవ నాయకులు తమ సంతోషాన్ని తెలియపరిచారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నూతన ఎఐసిసి కమిీని నియమించి నియామక పత్రాలు అందించారు. రెవ.డా||ఎజ్రా రాయపాిని రాష్ట్ర వైస్‌ ప్రెసిడ్‌ెంగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకులు మరియు హైద్రాబాద్‌ హెడ్‌ ఆఫీస్‌ నుండి వచ్చిన రమేష్‌ తదితరులు అభినందించారు. 


 తాజా వీడియోలు 
తాజా వార్తలు