రాష్ట్రీయం

మదర్‌ ధెరిసాపై వివాదాస్పదమైన వ్యాఖ్య - ఖట్జూ

న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ మరోసారి అలాిం వ్యాఖ్యలే చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ సారి ఇీవలే సెయ్‌ిం హోదా పొందిన మదర థెరిసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఖట్జూ. నాకు కూడా ఎవరైనా ఓ పది మిలియన్ల డాలర్లిస్తే నేను కూడా పేదలకు, ఇళ్లులేని నిర్భాగ్యులకు సేవ చేస్తా అని వ్యాఖ్యానించారు. మదర్‌ థెరిసాకు రోమనచీ కాథలిక్‌ చర్చి సెయ్‌ిం హోదా ఇవ్వటంపై ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో సెప్టెంబర్‌ 6వ తేదీన ఈ వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరకర వనరుల నుంచి మదర్‌ ఆర్ధిక విరాళాలు స్వీకరించారని ఆయన అన్నారు. అంతేగాక, నా అభిప్రాయంలో ఆమె మిడిమిడి జ్ఞానం ఉన్న మతఛాందసురాలు, మూఢ విశ్వాసురాలు. మోసం చేసే వ్యక్తి అని ఖట్జు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నారు. మదర్‌ థెరిసా వందలాది దేశాల నుంచి ప్రశ్నార్ధకమైన దాతల నుంచి విరాళాలు సేకరించారని వ్యాఖ్యానించిన ఖట్జూ తనకు కూడా డబ్బులిచ్చే వాళ్లుంటే తాను కూడా సేవ చేయగలనని అన్నారు. కాగా, ఖట్జూ వ్యాఖ్యలపై నెిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మదర్‌ థెరిసా లాిం సేవకురాలిని విమర్శించడం సరికాదని అన్నారు. ఖట్జూ లాిం వ్యక్తులకు మదర్‌ థెరిసా లాిం గొప్ప వ్యక్తుల గురించి ఇలాిం అభిప్రాయాలే ఉంాయని ధ్వజమెత్తారు. సిగ్గు లేకుండా ఇలాిం వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మరికొందరు ఖట్జూపై విరుచుకుపడ్డారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు