గుంటూరు

క్రైస్తవ భవన్‌కు మోక్షమెప్పుడో?

- క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శిలాఫలకం వద్ద ధర్నా

గుంటూరు :
క్రైస్తవుల సమస్యలపై వెంటనే అసెంబ్లీలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు చర్చ జరపాలని క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మండలంలోని అడవితక్కెళ్ళపాడు గ్రామంలో గత ఏడాది శంకుస్థాపన చేసిన క్రైస్తవ భవన్‌ శిలాఫలకం ఎదుట సెప్టెంబర్‌ 7వ తేదీన ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆల్‌ ఇండియా క్రైస్తవ సంఘాల సమాఖ్య ఎపి అధ్యకక్షుడు మ్టా ప్రభాత్‌ కుమార్‌ మ్లాడుతూ మంత్రి, ముఖ్యమంత్రి కలిసి గత ఏడాది క్రైస్తవ భవన్‌కు రెండు ఎకరాలు కేయించామని చెప్పి శంకుస్థాపన చేశారే గానీ ఆదరణ మరిచారన్నారు. లక్షలాది రూపాయిల ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కలెక్టరు స్థాయి అధికారులతో క్రైస్తవ అభివృద్ధి సంక్షేమ పధకాల అమలుపై సమగ్ర పర్యవేక్షణ చేప్టాలని డిమాండ్‌ చేశారు. దుల్హన్‌ పధకానికి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు కమిీలను నియమించాలని, క్రైస్తవ శ్మశానాలకు స్థలాలను కేయించాలని, మైనారిీ అత్యాచార నిరోధక చ్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ిడిపి మ్యానిఫెస్టోలో ప్రకించిన విధంగా దళిత క్రైస్తవులకు ఎస్సి హోదా కల్పించే విధంగా అసెంబ్లీలో బిల్లును ప్రవేశప్టోలని డిమాండ్‌ చేశారు. అక్రమ కేసులతో పాస్టర్లను వేధిస్తున్న జివొ నెం.748/747ను రద్దు చేయాలని, గత నెలలో గోదావరి జిల్లాలో నక్సలైట్ల దాడిలో హతుడైన పాస్టర్‌ మారయ్యకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకించాలని విజ్ఞప్తి చేశారు. క్రైస్తవ సంఘాల నాయకులు జెరుసలెం ముత్తయ్య, మరియదాసు, జోసఫ్‌ బాబూరావు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు