క్రిష్ణ

క్రిస్టియన్ల అభివృద్ధికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు సిఎం చంద్రబాబు

విజయవాడ : రాష్ట్రంలో క్రిస్టియన్ల అభివృద్ధికి పూర్తిస్థాయి సహాయ, సహకారాలు అందిస్తామని, వారి అభివృద్ధికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. క్రిస్టియన్‌ కార్పొరేషన్‌కు వెంటనే ఛైర్మన్‌ను నియమించాలని కోరుతూ క్రిస్టియన్‌ సెల్‌ చిత్తూరు ిడిపి అధ్యకక్షుడు యలమంచిలి ప్రవీణ్‌, పలువురు క్రిస్టియన్‌ ప్రముఖులతో కలిసి సెప్టెంబర్‌ 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుసుకుని వినతిపత్రం అందించారు. దీనికి సిఎం సానుకూలంగా స్పందిస్తూ క్రిస్టియన్లకు ఇచ్చిన హామీల ప్రకారం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర అధ్యకక్షుడు సాల్విన్‌బాబు మ్లాడుతూ క్రిస్టియన్‌ సెల్‌కు పూర్తిస్థాయిలో కార్యవర్గాన్ని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యకక్షుడు విజయబాబు, బి.వి.పాలరాజు, రాబర్ట్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు