గుంటూరు

గోడపై క్రీస్తు సందేశం చెరపడంతో ఉద్రిక్తత

గుంటూరు : నగరంలోని గుంటగ్రౌండ్‌కు సంబంధించిన ప్రహరీ గోడపై క్రీస్తు వాక్యాలను నగరపాలక సంస్థ అధికారులు సెప్టెంబర్‌ 2వ తేదీన చెరిపి వేయించారు. దీంతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎఇఎల్‌సి బిషప్‌ రెవ.పరదేశిబాబు, ట్రెజరర్‌ పాల్‌ ప్రభాకర్‌, ఎసి కళాశాల ప్రిన్సిపాల్‌ ముత్యం, కళాశాల అధ్యాపకులు, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో గుంటగ్రౌండ్‌ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈస్ట్‌ డిఎస్పి సంతోష్‌ ప్రిన్సిపల్‌, కళాశాల అధ్యాపకులతో చర్చించి గోడలపై తిరిగి క్రీస్తు వాక్యాలను రాయించేలా చర్యలు తీసుకుాంమని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు