విజయనగరం

బైబిల్‌ యూనివర్శిీ డైరెక్టర్‌కు రిమాండ్‌

డెంకాడ : మోదవలసలో ఉన్న రెసిడెన్షియల్‌ బైబిల్‌ యూనివర్శిీ డైరెక్టర్‌ లాజరస్‌ ప్రసన్నబాబుకు సెప్టెంబర్‌ 16వ తేది వరకు కోర్టు రిమాండ్‌ విధించిందని డెంకాడ ఎస్సై ధనుంజయరావు సెప్టెంబర్‌ 4వ తేదీన తెలిపారు. బైబిల్‌ యూనివర్శిీలో చదువుతున్న విద్యార్ధి నులను శారీరకంగానూ, మానసికంగానూ వేధింపులకు గురి చేశారన్న ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జులై 25న ప్రసన్నబాబుపై కేసు నమోదు చేశారు. పిల్లల నేర నిరోధన చట్టం, నిర్భయ విం పలు సెక్షన్ల కింద అప్ప్లో అతనిపై కేసు నమోదు చేశారు. అయితే, అప్పి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. చివరకు విశాఖపట్నంలో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ధనుంజయరావు తెలిపారు. సెప్టెంబర్‌ 3వ తేది రాత్రి 10 గం||ల ప్రాంతంలో ఎస్సి, ఎస్టి కోర్టు జడ్జి ముందు అతనిని ప్రవేశప్టోమన్నారు. నిందితుడికి న్యాయమూర్తి సెప్టెంబర్‌ 16వ తేది వరకు రిమాండ్‌ విధించారని తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు