రాష్ట్రీయం

మదర్‌ను సెయ్‌ింగా ప్రకిస్తున్న పోప్‌ ఫ్రాన్సిస్‌

కోల్‌కతా : వాికన్‌లో ప్రతిపాదిత సెయ్‌ిం (పవిత్రమూర్తి) గుర్తించే కార్యక్రమం సెప్టెంబర్‌ 4న జరుగనున్న నేపధ్యంలో పేదల పెన్నిధి, మానవతామూర్తి మదర్‌ థెరిస్సా 106 వ జయంతి వేడుకలను కోల్‌కతాలో ఘనంగా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా అన్ని చర్చిలు, ఛారిీ కేంద్రాల మిషనరీలు ప్రత్యేక ప్రార్ధనా కార్యక్రమాలను నిర్వహించాయి. కోల్‌కతా నగరానికి థెరిసాను అందించిన జీసస్‌ భగవానుడికి జన్మాంతం రుణపడి ఉంామని మిషనరీల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రఖ్యాత నందన్‌ మల్టిప్లెక్స్‌లో మదర్‌ థెరిస్సా జీవితంపై అంతర్జాతీయ చిత్రోత్సవాన్ని ఆగస్టు 26వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిస్టర్‌ ప్రేమ మ్లాడుతూ మదర్‌ థెరిస్సా భగవంతుడి సన్నిధికి చేరుకొన్నదని, ప్రతీ మనిషి హృదయంలో విశ్వాస కాంతిరేఖలను, శాంతిని నింపే కార్యక్రమాన్ని ఆమె ఇంకా కొనసాగి స్తున్నారని అన్నారు. థెరిస్సాకు ముఖ్యమంత్రి మమతాబెనర్జి ి్వట్టర్‌లో ఘనంగా నివాళులర్పించారు. మదర్‌ను సెయ్‌ింగా పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రకించే కాననైజేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌, ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఇతర ప్రముఖులు వాికన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాననైజేషన్‌ కార్యక్రమం కోసం భారత అధికారిక బృందంలో ఒకరిగా వెళ్లడం లేదు, కానీ రాష్ట్రంలోని మిషనరీలకు చెందిన బ్రదర్స్‌, సిస్టర్ల అతిధిగా వెళ్తున్నానని సిఎం మమతాబెనర్జి పేర్కొన్నారు. గతంలో తాను ఎంపిగా ఉన్నప్పుడు కొందరు గూండాలు తమ ఆశ్రమాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మదర్‌ థెరిస్సా ఫోన్‌ చేసిన విషయాన్ని మమత గుర్తు చేసుకొన్నారు. వెంటనే తాను స్పందించి పార్టీ కార్యకర్తలను అక్కడికి పంపించి ఆ దాష్టీకాన్ని అడ్డుకొన్నానని తెలిపారు. కిక పేదరికంతో బాధపడుతున్న అన్నార్తుల కోసం పశ్చిమ బెంగాల్‌లో మానవతామూర్తి థెరిస్సా పలు మిషనరీలను స్థాపించారు. ఆమె సేవల ముద్రలు కోల్‌కతా మురికివాడల ప్రజలపై ఇంకా ఉన్నాయి. 1937 నుంచి 1948 వరకు లోరో సెయ్‌ిం మేరీ పాఠశాలలో మదర్‌ బోధించారు. 1944 హెడ్‌ మిస్ట్రస్‌గా మదర్‌ను నియమించారు. 1948లో లోరో కాన్వ్‌ెం నుంచి బయటకు వచ్చాక మురికి వాడల్లో రెండు నెలలపాటు నివసించారు. అప్పుడే అనారోగ్యానికి గురైన వారికి, పేదలకు సేవలందించేందుకు ఇచ్చే ప్రాధమిక శిక్షణకు ఆమెను తీసుకొన్నారు. అప్పి నుంచి పేదల, రోగుల సంక్షేమానికి 14 క్రీక్‌ లేన్‌లో మిషనరీలు స్థాపించారు. సెప్టెంబర్‌ 4న జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రముఖులు పాల్గొాంరు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు