క్రిష్ణ

ప్రభువు చింతనలో జీవించాలి

- దైవజనులు డా||పి.సతీష్‌ కుమార్‌ పిలుపు

- లబ్బీపేటలో ఘనంగా కల్వరి టెంపుల్‌ ప్రారంభోత్సవం

విజయవాడ :
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కేంద్రమైన విజయవాడ గుంటూరు మధ్య ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక కల్వరి టెంపుల్‌ను నిర్మిస్తామని కల్వరి టెంపుల్‌ వ్యవస్థాపకులు డా||పి.సతీష్‌ కుమార్‌ అన్నారు. ఎంజి రోడ్డులోని లబ్బీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన కల్వరి హౌస్‌ ప్రార్ధనా మందిరాన్ని ఆగస్టు 30వ తేది సాయంత్రం సతీష్‌కుమార్‌, సతీమణి సునేత్రితో కలిసి ప్రారంభించారు. తొలుత దేవుని వాక్యం చదివి ప్రార్ధనలు చేశాక కేకును క్‌ చేశారు. మీడియాతో మ్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్నవారంతా ఆధ్యాత్మికంగా దేవుని చింతనలో ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ కల్వరి హౌస్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి శ్రేయస్సు కోసం ఇక్కడ 24 గంటలూ ప్రార్ధనలు నిర్వహిస్తారన్నారు. పుస్తక విక్రయ కేంద్రంలో క్రైస్తవ ఆధ్యాత్మిక పుస్తకాలు, బైబిల్స్‌, పాటల సిడిలు, ఫ్రేమ్‌లు విం వస్తు సామాగ్రి విక్రయిస్తామని సతీష్‌ కుమార్‌ చెప్పారు. తాను తుదిశ్వాస వరకు వారి ఎపి, తెలంగాణల్లోని క్లోాదిమంది విశ్వాసుల సేవలోనే ఉంానన్నారు. కార్యక్రమంలో కల్వరి టెంపుల్‌ యాజమాన్య బృందం, పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు హాజరయ్యారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు