హైదరాబాద్

దివ్యవాణి క్రైస్తవ ి.వి.ఛానల్‌ ప్రారంభం

హైద్రాబాద్‌ : దివ్యవాణి క్యాథలిక్‌ క్రైస్తవ ఛానల్‌ ఆగస్టు 31వ తేదీన ప్రారంభమైంది. క్యాథలిక్‌ మత గురువుల సమక్షంలో సికింద్రాబాద్‌ సెయ్‌ిం మేరీస్‌ స్కూల్‌ ఆవరణలో ఛానల్‌ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాికన్‌ ప్రతినిధి ఆర్చ్‌ బిషప్‌ సాల్వతోరే ఫెన్నాఖియో ముఖ్య అతిధిగా హాజరై ఛానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మ్లాడుతూ క్యాథలిక్‌ల ఆధ్వర్యంలో మొట్టమొదిసారిగా తెలుగులో ి.వి.ఛానల్‌ ప్రారంభించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ ఛానల్‌ క్రైస్తవులకు ఆత్మీయంగా ఎంతో సహాయపడగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారతదేశంలో 25 శాతం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు రోమన్‌ క్యాథలిక్‌ సంస్థల ద్వారా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. హైద్రాబాద్‌ ఆర్చ్‌ బిషప్‌ తుమ్మబాల మ్లాడుతూ వివిధ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు దివ్యవాణి ఛానల్‌ ఎంతో దోహదపడుతుందని వివరించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు