గుంటూరు

జెరూసలెం యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నుంచి జెరూసలెం యాత్రకు వెళ్లాలనుకునే క్రైస్తవుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎపి రాష్ట్ర క్రైస్తవ ఆర్ధిక సంస్థ కార్య నిర్వాహక సంచాలకులు సయ్యద్‌ సిరాజుల్లా తెలిపారు. ఈ యాత్రకు ఎంపికైన ఒక్కొక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేలు చొప్పున ఆర్ధిక సాయం చేస్తుందన్నారు. ఆసక్తి కలిగిన వారు www.christianminorities.ap.nic.in వెబ్‌స్‌ై ద్వారా ఆన్‌లైన్‌లో ఆగస్టు 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యాత్ర ఏడు రోజులపాటు ఉంటుందని వివరించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు