రంగారెడ్డి

క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలి

రంగారెడ్డి : క్రైస్తవుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎ.పి స్టేట్ క్రిస్టియన్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉమాశంకర్ పేర్కొన్నారు. సోమవారం కార్పొరేషన్ నిర్వహించిన సదస్సులో ఎం.డి ఉమాకాంత్, జాతీయ అధ్యక్షుడు సామెపాల్, రాష్ట్ర కార్యదర్శి జోసఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ, క్రిస్టిన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో ఆర్థికంగా ప్రతి ఒక్కరు లబ్ధి పొందడానికి ధృవీకరణ పత్రాలు సమర్పించాలని, పత్రాలు మెయిన్‌లైన్ చర్చస్, రిజిస్టర్డ్, పబ్లిక్ రికగ్నైజ్డ్ చర్చస్, మ్యారేజ్ లైసెన్స్‌డ్ పాస్టర్స్ ఇచ్చినవి మాత్రమే చెల్లుబాటవుతాయని తెలిపారు. వారు ఇచ్చిన ధృవీకరణ పత్రాలు మాత్రమే క్రైస్తవులు బిసిలుగా అధికారికంగా గుర్తింపు పొందుతాయని ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. కార్పొరేషన్ నేతలు డా. చల్లప్ప, హెబ్రోస్ ఇజ్రాయేల్, ఎమ్మెల్సీ క్రిస్టీన్ లాజరస్, మేరీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు