అంతర్జాతీయం

భారత్‌లో మైనారిీలపై వివక్ష - అమెరికా విదేశాంగ శాఖ నివేదిక

వాషింగ్టన్‌ : గత ఏడాది భారత్‌లో మత పరమైన కారణాలతో హత్యలు, దాడులు, బలవంతపు మత మార్పిడులు, అల్లర్లు, స్వచ్ఛంద మత మార్పిడి హక్కును అడ్డుకోవడాలు జరిగాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. 2015లో మత స్వేచ్ఛపై ఆగస్టు 10వ తేదీన వెలువరించిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది. ప్రభుత్వ వివక్ష పట్ల, ప్రభుత్వ పాఠశాలలో హైందవం బోధించాలన్న అధికారుల ప్రయత్నాల పట్ల భారతీయ మైనారిీలు ఆందోళన చెందుతున్నారని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారులు కూడా వివక్షా పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. మతపరమైన, ఇతర హింసకు గురైన మైనారిీలు పోలీసులను ఆశ్రయించినపుడు పెద్దగా ప్టించుకోవడం లేదని తెలిపింది. కేసులు నమోదు చేయకపోవడమే కాకుండా ఒక్కోసారి ఒత్తిడి చేస్తే వాళ్లపైనే తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని పేర్కొంది. దేశంలో సంపూర్ణ మత స్వేచ్ఛ ఉంటుందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇీవల క్రైస్తవులకు హామీ ఇచ్చినా ఇలాింవి జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు