గుంటూరు

క్రీస్తును ధ్యానిస్తే పరలోకం ప్రాప్తిస్తుంది

 గుంటూరు : క్రీస్తును ధ్యానిస్తే పరలోకం ప్రాప్తిస్తుందని, సాగర్‌మాత విచారణా గురువు హృదయ్‌కుమార్‌ ఉద్భోదించారు. జులై 31వ తేదీన విజయపురి సౌత్‌ లోని సాగర్‌మాత ఆలయంలో ఆయన పాల్గొని భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం భక్తులు దేవాలయంలో కొవ్వొత్తులు వెలగించి తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించారు. సాగర్‌మాత దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని, ప్రదక్షిణలు చేసి యేసుక్రీస్తును భక్తి శ్రద్ధలతో స్తుతించారు. జపమాల క్షేత్రంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు