అంతర్జాతీయం

ప్యారిస్‌ చర్చిపై దాడి కేసులో నిందితుడి అరెస్టు

ప్యారిస్‌ : చర్చి పై దాడి కేసుతో ప్రమేయముందన్న ఆరోపణపై 17 ఏళ్ల మైనర్‌ బాలుడ్ని జెనీవాలో అరెస్టు చేసి, ఫ్రెంచ్‌ అధికారులకు అప్పగించినట్లు స్విట్జర్లాండ్‌ పోలీసులు తెలిపారు. ఆ బాలుడు, ఈ దాడులతో సంబంధమున్న మరో వ్యక్తి అడెల్‌ కెర్మెచి కలిసి సిరియా పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్విస్‌ అధికారులు ఆయనను పట్టుకున్నట్లు జ్యుడి షియరీ వర్గాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది. బాలుడికి గత వారం జరిగిన చర్చి దాడితో నేరుగా సంబంధమున్నట్లు ఎలాిం ఆధారాలు లేకపోయినా, కెర్మెచి, అబ్దుల్‌ మాలిక్‌ విం ఉగ్రవాదులతో అతడికి వున్న సంబంధాల రీత్యా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు