నెల్లూర్

పాస్టర్‌ మారయ్యను హత్య చేసిన మావోయిస్టులపై ఎఐసిఎఫ్‌ ఖండన

నెల్లూరు : తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం లస్సీ గూడెంలో పాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉయాక మారయ్య అనే పాస్టర్‌ను జులై 29వ తేదీన పోలీసు ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో హత్య చేయడాన్ని ఆలిండియా ఫెడరేషన్‌ నెల్లూరు జిల్లా కమిీ అధ్యకక్షుడు రాయపాి ఉదయ్‌ కుమార్‌ ఖండిస్తూ మారయ్య కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 1వ తేది ఉదయం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మ్లాడుతూ నిద్రపోతున్న సమయంలో చేతులు వెనక్కు క్టివేసి కర్రలతో తీవ్రంగా క్టొి ఆయన భార్య, గ్రామస్థులు అడ్డుపడినా వారిని పక్కకు న్టెి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చడం మావోయిస్టులకు తగదని హెచ్చరించారు. ప్రభుత్వం వారి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబ సభ్యుల అర్హతగా ఉన్న వారికి ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసురత్నం, శామ్యూల్‌ పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు