జాతీయం

విజిలెన్స్‌ పరిధిలోకి ''మత మార్పిడులు''

 - కేరళ విఎసిబి డిజిపి థామస్‌

తిరువనంతపురం :
ఆర్ధిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న మతమార్పిడులను అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి తీసుకువచ్చే విషయాన్ని కేరళ విజిలెన్స్‌, యాీం-కరెప్షన్‌ బ్యూరో (విఎసిబి) పరిశీలిస్తోందని విఎసిబి డైరెక్టర్‌, డిజిపి జాకబ్‌ థామస్‌ తెలిపారు. 'డబ్బుతో ముడిపడి ఉన్న మతమార్పిడులు కచ్చితంగా అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రావాల్సిందే' అని పిఐతో మ్లాడుతూ ఆయన అన్నారు. 'అవినీతి గొలుసు విస్తృతమవుతోంది. అందులో ప్రజాసేవకుల పాత్ర కూడా ఉంోంది. ఇందులో ప్రజాధనం లేదా ప్రజావనరులు గణనీయంగా ఇమిడి ఉంటున్నాయి' అని చెప్పారు. కొన్ని ప్రయోజనాలను పొందేందుకు అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మతమార్పిడులతో ప్రజలకు ఎటువిం ప్రయోజనం ఉండదని చెప్పారు. కేరళలో మతమార్పిడులు ప్రధానంగా క్రిస్టియన్‌, హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 'మతమార్పిడులు బలవంతంగా జరిగితే, దానిని నేరుగా పరిగణించాలి. ఇందుకోసం డబ్బు ఇస్తే దానిని అవినీతి క్రింద నేరంగా పరిగణించాలి. అప్పుడు దానిపై దర్యాప్తు జరుపుతాం' అని థామస్‌ తెలిపారు. ఇీవల కాలంలో కొంత మంది హిందూ, క్రిస్టియన్‌ యువకులు ఇస్లాం మతంలోకి మారానికి ముందు వారు కనిపించకుండా పోతున్నారు. వారు ఇస్లామిక్‌ స్ట్‌ేలో చేరారని అనుమానిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు. వివిధ రకాల అవినీతి గురించి తనకు తెలుసునని, అన్ని కోణాలలో దీనిపై ఏజెన్సీ పర్యవేక్షణ జరుపుతుందని థామస్‌ తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు