అంతర్జాతీయం

ఆషిజ్‌ను సందర్శించిన పోప్‌ ఫ్రాన్సిస్‌

పోలాండ్‌ : నాజీ జర్మన్‌ డెత్‌ క్యాంపు ఆషిజ్‌ బిర్కేనవ్‌ను జులై 29వ తేదీన పోప్‌ ఫ్రాన్సిస్‌ సందర్శించారు. హిట్లర్‌ బలగాలు పది లక్షలమందిని చంపిన ఈ ప్రాంతాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. చనిపోయిన వారి కోసం ఆయన మౌనంగా ప్రార్ధించారు. మృతి చెందిన వారి కోసం కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక వ్యక్తి ప్రాణాలను రక్షించడానికి తన ప్రాణాలను వదిలేసిన క్రైస్తవ మత బోధకుడి కోసం ఫ్రాన్సిస్‌ ప్రత్యేకంగా ప్రార్ధించారు. కాగా, ఆషిజ్‌ ప్రాంతాన్ని సందర్శించిన మొది అర్జీెంనా వ్యక్తి పోప్‌ ఫ్రాన్సిసే.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు