క్రిష్ణ

దళిత క్రైస్తవులకు రక్షణ కల్పించాలి

విజయవాడ : దళిత క్రైస్తవులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని నిరంతరం వారిపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం అరికట్టడంలో వైఫల్యం చెందుతుందని ఇప్పికైనా వారి రక్షణకు చర్యలు చేప్టాలని ఇండియన్‌ దళిత క్రిస్టియన్‌ ర్స్‌ై జాతీయ అధ్యకక్షులు పెరికె వరప్రసాద్‌ ఆగస్టు 1వ తేదీన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. జులై 30న మావోయిస్టు చేతిలో హత్యకు గురైన పాస్టర్‌ మారయ్య కుటుంబానికి 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన కోరారు. లచ్చిగూడెం గ్రామంలో గత 15 సంవత్సరాలుగా చర్చి నిర్వహిస్తున్నారని ఇంో్ల నిద్రిస్తున్న సమయంలో ఊరు చివరకు తీసుకువెళ్లి విచక్షణారహితంగా క్టొి గొంతు కోసి హత్య చేయడం చాలా శోచనీయమని తెలిపారు. గతంలో కూడా ఆయనను ఇలాగే మావోయిస్టులు హింసించారని దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా సరియైన రక్షణ కల్పించలేదని దీనికి బాధ్యులైన డిఎస్పిని తక్షణం సస్పెండ్‌ చేయాలని ఆయన కోరారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు