అంతర్జాతీయం

ఈ యుద్ధానికి మతం కారణం కాదు : పోప్‌

క్రాకోవ్‌ : ప్రపంచంలో యుద్ధం జరుగుతున్నదని, అయితే అందుకు మతం మాత్రం కారణం కాదని పోప్‌ ఫ్రాన్సిస్‌ పేర్కొన్నారు. ప్రపంచ యువజనోత్సవాలలో పాల్గొనేందుకు పోలాండ్‌ వచ్చిన పోప్‌ జులై 27వ తేదీన క్రాకోవ్‌లో నగర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వార్ధ ప్రయోజనాలు, డబ్బు, వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్నాయని, మతం కోసం కాదని పోప్‌ చెప్పారు. అన్ని మతాలు శాంతినే కోరుతున్నాయని, ఇతరులే యుద్ధం చేస్తున్నారని అన్నారు. భయాన్ని అధిగమించాలంటే యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి వలస వస్తున్న వారికి స్వాగతం పలుకాలని చెప్పారు. శరణార్ధులకు ద్వారాలు తెరవాలంటే గొప్ప జ్ఞానం, ప్రేమ ఉండాలని పోలండ్‌ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు