క్రిష్ణ

బోధకుని వికృత చేష్టలు

- విజయనగరం జిల్లా డిఎస్పికి విద్యార్ధుల తల్లిదండ్రులు ఫిర్యాదు

విజయనగరం :
అంతా అతడిని డాడీ అని పిలుస్తారు... అయినా కన్న పిల్లల్లాిం వారిపై వికృత చేష్టలు సహించలేకపోతున్నాం. అభం, శుభం తెలియని అమాయక బాలికలపై లైంగిక దాడులు, అసభ్యకర పనులు చేయడం దారుణం. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలి.... బాలికలను చెరనుంచి విడిపించాలి... అని విద్యార్ధినుల తల్లిదండ్రులు జులై 25వ తేదీన విజయనగరం జిల్లా డిఎస్పి రమణ ఎదుట వాపోయారు. తక్షణమే మత బోధకుడు లాజరస్‌ ప్రసన్నబాబుపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస గ్రామంలోని జయశాలి రెసిడెన్షియల్‌ బైబిల్‌ యూనివర్శిీ ఇంటర్నేషనల్‌పై అక్కడి విద్యార్ధుల తల్లిదండ్రులు విరుచుకుపడ్డారు. ఈ సంస్థ యజమాని లాజరస్‌ ప్రసన్నబాబు శిక్షణ పొందుతున్న విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పదిమంది విద్యార్ధినుల తల్లిదండ్రులు జులై 25వ తేదీన జిల్లా డిఎస్పి ఎ.వి.రమణకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. శిక్షణ పొందుతున్న విద్యార్ధిని తల్లి రాజకుమారి, మాజీ వార్డెన్‌ దైవరూపిణి శిక్షణా కేంద్రంలో అక్రమాలను డిఎస్పికి వివరిస్తూ... లాజరస్‌ ప్రసన్నబాబు క్రైస్తవుల ఇళ్లకు వెళ్లి మామూలు చదువులకు బదులు బైబిల్‌ చదవటం ద్వారానే పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని నమ్మించి తన బైబిల్‌ శిక్షణా కేంద్రానికి తీసుకువెళ్తానని, ఏడాదికి లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తూ ఐదేళ్లపాటు శిక్షణ ఇస్తారని తెలిపారు. 12 ఏళ్ల వయసున్న బాలబాలికలకు ఇక్కడ శిక్షణ ఇస్తారని చెప్పారు. శిక్షణ పొందుతున్న బాలురతో లోపల పనులు చేయించడం, సున్నాలు వేయించడం లాింవి చేయిస్తారన్నారు. శిక్షణా కేంద్రంలో లాజరస్‌ కుటుంబంతో కలిసి ఉంటున్నప్పికీ దూరంగా నిర్మించిన ప్రత్యేక గదిలోకి రాత్రి సమయంలో బాలికలను పిలిచి వారిపట్ల వికృతంగా ప్రవర్తిస్తూ, లైంగికంగా వేధిస్తున్నారని తెలిపారు. రాజకుమారి మ్లాడుతూ కేంద్రంలోని బాలికలకు నీలి చిత్రాలను చూపిస్తూ పెడత్రోవ ప్టిస్తున్నారని ఆరోపించారు. తల్లిదండ్రుల నుంచి ఫోన్‌ వచ్చిందన్న నెపంతో ఇీవలే తన కుమార్తెను గదికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో ఆమె హడలిపోయి మానసికంగా తీవ్ర వేదనలో కూరుకుపోయిందన్నారు. ఇీవల ఉద్యోగం వదిలేసిన సంస్థ మాజీ వార్డెన్‌ దైవరూపిణి మ్లాడుతూ తనకు లొంగిపోయిన బాలికలను పాపులుగా ఉపయోగించుకుంటూ, లొంగని బాలికలను వేధిస్తున్నారన్నారు. లాజరస్‌ ప్రసన్నబాబు తండ్రి, సంస్థ డైరెక్టర్‌ పిడి సుందరరావు కూడా తన కుమారుడు తిరుగుబోతని గతంలో ఆరోపణలు చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఈ అకృత్యాలను గమనించిన తాను, విషయాన్ని బాలికల తల్లిదండ్రులకు తెలియజేసి వారిని ఆ చెర నుంచి పంపించేశానని తెలిపారు. ఇలాిం వారిని వదిలేస్తే దైవసేవకు మాయని మచ్చగా మారుతారని, సంస్థను మూయించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిఎస్పి రమణ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

డిఎస్పి ఎ.వి.రమణ మూడు బృందాలతో గాలింపు : బైబిల్‌ యూనివర్శిీ డైరెక్టర్‌ ప్రసన్నబాబుపై వచ్చిన ఆరోపణలపై లోతైన దర్యాప్తు నిర్వహిస్తున్నామని విజయనగరం జిల్లా డిఎస్పి ఎ.వి.రమణ తెలిపారు. జులై 26వ తేదీన ఆయన విలేకరులతో మ్లాడుతూ ఆ కళాశాలలో శిక్షణ పొందుతున్న విద్యార్ధినులను విచారించామని, వారు డైరెక్టర్‌ ప్రసన్నబాబుపై చేసిన ఆరోపణలు నిజమని డిఎస్పి రమణ తెలియజేశారు. విచారణ అనంతరం యూనివర్శిీలోని కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నామని, వీిలో ఇంకేమైనా అశ్లీల దృశ్యాలు, సాహిత్యం ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని వివరించారు. యూనివర్శిీ డైరెక్టర్‌ ప్రసన్నబాబు భార్య, తన భర్త యూనివర్శిీ పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లారని అంటున్నా, అతను పరారీలో ఉన్నట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. డైరెక్టర్‌ ప్రసన్నబాబు ఆచూకీ కోసం మూడు బృందాలను నియమించామన్నారు. సమావేశంలో టుౌన్‌ సిఐ జి.డి.ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు