అంతర్జాతీయం

ఫాన్స్‌లో గొంతుకోసి మతాధికారి హత్య

- పోలీసు కాల్పుల్లో అగంతకులు మృతి

పారిస్‌ :
ఫ్రాన్స్‌లో ఇద్దరు అగంతకులు ఘాతుకానికి తెగబడ్డారు. ఓ చర్చిలోకి ప్రవేశించి ఐదుగురిని బందీలుగా పట్టుకున్నారు. ఓ మతాధికారిని గొంతుకోసి చంపారు. అనంతరం వారు పోలీసు కాల్పుల్లో హతమయ్యారు. ఫ్రాన్స్‌ నార్మండీ ప్రాంతంలోని సెయ్‌ిం ఎియెన్నే డ్యు రౌవ్రే పట్టణంలోని చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చర్చిలోని ముగ్గురిని పోలీసులు కాపాడగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలవడంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమ్టిడుతున్నారని అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి బ్రాండ్‌ె వెల్లడించారు. చర్చిని అపహరణ నిరోధక దళానికి చెందిన బిఆర్‌ఐ బలగాలు చుట్టుముట్టగా, ఇద్దరు అగంతకులు బయికొచ్చారనీ, వారిని పోలీసులు కాల్చి చంపారని వివరించారు. ఉదయం వేళ ప్రార్ధనల సందర్భంగా ఇద్దరు అగంతకులు చర్చిలోకి ప్రవేశించి బందీలుగా పట్టుకున్నారు. దాడులకు పాల్పడిన వారి వివరాలు, లక్ష్యాలు తెలియరాలేదు. ప్రత్యేక దళాలు చర్చిలో పేలుడు పదార్ధాల కోసం సోదాలు చేప్టాయి. ఉగ్రవాద వ్యతిరేక దళాల్ని పిలిపించారు. ఇది డాయిష్‌ (ఐఎస్‌ఐఎస్‌) ఉగ్రవాదులు చేసింది పిరికి హత్య అంటూ ఘటనను ఫ్రాన్స్‌ అధ్యకక్షుడు ఫ్రాంక్స్‌వో హోలన్‌ ఖండించారు. దేశంలో అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. ఇప్పికీ ముప్పు తీవ్రంగానే ఉందన్నారు. మృతి చెందిన మతాధికారిని జాక్వెస్‌ హామెల్‌ (84) గా గుర్తించారు. ఇది చర్చిపై జరిగిన క్రూరమైన దాడి అని ఫ్రాన్స్‌ ప్రధాని మాన్యుయెల్‌ వాల్స్‌ పేర్కొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు