గుంటూరు

లోక రక్షకుడితో శాంతి సందేశం

గుంటూరు : లోక రక్షకుడు చిత్రంలో ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇవ్వనున్నట్లు నిర్మాత చండ్రా చంథ్రేఖర్‌ అన్నారు. పాత బస్టాండ్‌లోని పరిశుద్ధ మత్తయి తూర్పు గురు మండలంలో జులై 19వ తేదీన ఆయన విలేకర్లతో మ్లాడారు. ఈ సందర్భంగా ఆయన మ్లాడుతూ చంద్రాస్‌ ఆర్ట్‌ మూవీస్‌పై లోక రక్షకుడు చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు నెలలో చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు. పది దేశాల్లోని నీ నటులు నిస్తున్నారని పేర్కొన్నారు. మేరిమాత పాత్రను లండన్‌ వాసి నించనుందని తెలిపారు. ఇంగ్లండ్‌లోని ప్రధాన చర్చిల్లో చిత్రీకరణ జరుగుతుందని అన్నారు. లాభం కోసం చిత్రాన్ని నిర్మించడం లేదని చెప్పారు. శాంతి, ప్రేమ, కరుణను ప్రపంచ జనాభాలో నింపాలని చిత్రాన్ని చిత్రీకరిస్తున్నామని అన్నారు. దర్శకుడు బ్రహ్మం, ఛాయాగ్రాహకుడు జి.కె.నాయుడు, రచయిత శ్రీనివాస్‌, పాస్టర్లు పురుషోత్తం, గుప్తా, నారాయణరెడ్డి, జోసఫ్‌కేరి, ప్రసాదరావు, అనంతరావు తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు