క్రిష్ణ

క్రైస్తవ మైనారిీ అభ్యర్ధులకు క్యాబ్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

- మైనార్టీ కార్పొరేషన్‌ ఇడి సిరాజుల్లా

విజయవాడ :
జిల్లాకు చెందిన నిరుద్యోగ క్రైస్తవ మైనారిీ యువతకు స్వయం ఉపాధి ధ్యేయంగా క్యాబ్‌ నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మైనారిీ కార్పొరేషన్‌ ఇడి సయ్యద్‌ సిరాజుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత పొందిన మైనారిీ యువతకు క్యాబ్‌లను సబ్సిడీ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పధకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కృష్ణాజిల్లా వాసులై ఉండాలని తెలిపారు. 21 నుంచి 50 సం||లోపు వయస్సు గలవారై ఉండాలని, ల్‌ై మోార్‌ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని తెలిపారు. ఆదాయ పరిమితికి సంబంధించి తెల్లకార్డు దారులై ఉండి గ్రామీణ ప్రాంతాలలో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలలోపు వార్షిక ఆదాయం కలిగి ఉండాలి. తహశిల్దార్‌తో క్రైస్తవ ధ్రువీకరణ పత్రం (బి.సి.సి.) లేదా 10వ తరగతి ిసి ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. దరఖాస్తుతోపాటు ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, 2 పాస్‌పోర్టు ఫోలు ఆన్‌లైన్‌ ద్వారా జులై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన వెబ్‌స్‌ై apobmms.cgg.gov.in  ద్వారా నమోదు చేసుకోవాలి. వివరాలకు జిల్లా కార్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రైస్తవ ఆర్ధిక సంస్థ, డోర్‌ నెం.66-5-6, 2వ ఫ్లోర్‌, స్ట్‌ే బ్యాంక్‌ ఆఫ్‌ ావన్‌కోర్‌ ఎదురుగా, ఎన్‌.ి.ఆర్‌.సర్కిల్‌, పటమట, విజయవాడ, కృష్ణాజిల్లా, సంప్రదించవలసిన ఫోన్‌ నెంబర్లు 0866-2491148, 99484 63029, 98499 01148.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు