రాష్ట్రీయం

విద్యుత్‌ ఉద్యోగులు మెరుపు సమ్మె

 విభజనపై వెల్లువెత్తుతున్న నిరసనలతో రాష్ట్రాన్ని కారు చీకట్లు కమ్మెస్తున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు ఒకదాని వెంట ఒకటికుప్పకూలుతున్నాయి. సీమాంధ్ర విద్యుత్‌ జేఏసీ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగుతున్నారు. ఇప్పటికే జల విద్యుత్‌, బొగ్గు ఉత్పత్తి కేంద్రాల్లో అవాంతరాలు విద్యుత్‌ ఉత్పత్తిని దెబ్బతీస్తున్నా యి. ఈ ప్రభావం దక్షిణాది రాష్ట్రాల గ్రిడ్‌పై కూడా పడే ప్రభావం ఉందన్న హెచ్చరికలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. శనివారం నాడు ఒక్క సారిగా విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాలో అంతరాయాల వల్ల వందలాది గ్రామాల్లో కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఎన్‌టీపీసీలోని ఆరు యూనిట్లలో 1250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండో యూ నిట్‌లో కూడా విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్‌టీ పీసీలో మొత్తం 1510 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలి చింది. 

ఆర్‌టీపీపీలోనూ 2560 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచింది. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో 240 మెగావాట్ల వద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం సీమాంధ్రలో ఆగ్రహ జ్వాలలను రగిలిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రభావం విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీపైన తీవ్రంగానే ఉంది. కేంద్ర కేబినెట్‌ నిర్ణయంపై ఆగ్రహంగాఉన్న సీమాంధ్ర విద్యుత్‌ ఉద్యోగులు, కార్మి కులు అప్రకటిత సమ్మెకు దిగారు. ఏపీ ఎన్‌జీవోల పిలుపు మేరకే ఈ సమ్మె చేస్తున్నామని కొందరు.. కాదు కాదు తా మే స్వచ్ఛందంగా చేస్తున్నామని మరికొందరు పేర్కొం టున్నారు. పలు జిల్లాల్లో ఉద్యోగులు, కార్మికులు మెరుపు సమ్మెకు దిగడంతో విద్యుత్‌ సరఫరా స్తంభించింది. విజ యవాడ సమీపంలోని నార్ల తాతారావు ఎన్‌టీపీసీఎస్‌ లోనూ ఈ ప్రభావం కనిపించింది. ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేసేవారు కరువవడంతో మొత్తం 1700 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయాలు ఏర్పడ్డాయి. అధికారులు అప్రమత్తమై ఏడో యూనిట్‌ను పునరుద్ధరిం చడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. 

అయితే ఎపీఎన్‌ జీవోలు ఇచ్చిన సమ్మెకు మద్దతుగా కొందరు విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేసేదాకా పరిస్థితి వెళ్లిందని తెలుస్తోంది. దీంతో ఆగ్రహం తో ఉన్న సీమాంధ్ర విద్యుత్‌ ఉద్యోగులు ఆరు జిల్లాలకు నాలుగు గంటలపాటు శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపివేసి తమ నిరసన ప్రకటించారు. ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకో వడంతో ఎట్టకేలకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించి పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసులు క్షమాపణ చెప్పడంతో విద్యుత్తు ఉద్యోగులు శాంతించారు. సమైక్యాంధ్ర ఉద్య మంలో భాగంగా అన్ని శాఖల ఉద్యోగులు బంద్‌లో పాల్గొ న్నవిధంగానే నెల్లూరు జిల్లాలోనూ విద్యుత్‌ ఉద్యోగులు శుక్రవారం బంద్‌లో పాల్గొన్నారు. విద్యుత్తు కార్యాలయం ముందు ప్రధాన రహదారులపై వాహనాలను అడ్డుకొని జై సమైక్యాంధ్ర అంటూ ధర్నా చేశారు. ఈ క్రమంలో అక్కడ రోడ్డుపై ఉన్న ఒక మొద్దుకు అగ్గిపెట్టారు. 

దీంతో రాకపో కలు ఆగిపోయాయి. పోలీసులు వచ్చి వారించారు. ఈ సందర్భంగా తమ నిరసనకు అడ్డురావద్దంటూ ఓ కార్మికు డు అక్కడే ఉన్న సీఐపై బతిమాలే క్రమంలో హఠాత్తుగా ఆ సీఐ కింద పడేసరికి పోలీసుల్లో ఆగ్రహం కట్టలు తెంచు కుంది. దీంతో కనిపించినవారిపై పోలీసులు లాఠీలతో తమ ప్రతాపం చూపించారు. అక్కడే ధర్నాలో ఉన్న విద్యు త్‌ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ సాయిబాబాపై కూడా పోలీసు లు జులుం ప్రదర్శించారు. ఈ వ్యవహారం ఫోన్లద్వారా మిగిలిన ఉద్యోగులకు చేరింది. దీంతో ఉదయం 11 గంట లకు ఆరు జిల్లాలకు సరఫరా నిలిపివేశారు. కృష్ణా, గుం టూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు సర ఫరా నిలిచిపోయింది. నెల్లూరులో ఈ సంఘటన వల్లే నిలిచిపోయిందని తెలుసుకునేందుకు విద్యుత్‌శాఖ ఉన్న తాధికారులకు కూడా చాలా సమయం పట్టింది.చివరికి జెన్‌కో, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు కల్పించుకుని ఉద్యో గులను శాంతింపజేశారు. అటు పోలీసులు కూడా ఉద్యోగులకు సారీ చెప్పడంతో పరిస్థితి కాస్త చల్లబడింది. శాంతించిన ఉద్యోగులు మధ్నాహ్నం 3 గంటల తర్వాత విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్‌ సరఫరా లేక పోవడంతో అటు ప్రజలు ఇటు వ్యాపార వర్గాలు తీవ్ర అసౌకర్యానికి గురైనారు. వివాదం చిన్నదే అయినప్పటికీ ఏకంగా విద్యుత్‌ సరఫరానే నిలిపివేసి ఆందోళన చేయడం ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల దాకా వెళ్లడం విశేషం. మొత్తం మీద నాల్గు గంటలపాటు విద్యుత్‌ సరఫరాను నిలిపి వేయడం ఉద్యమ తీవ్రతను తెలిపినట్లయిందని సీమాంధ్ర ఉద్యోగులు పేర్కొంటు న్నారు.  తాజా వీడియోలు 
తాజా వార్తలు