క్రిష్ణ

గన్నవరం పాస్టర్‌ అమెరికాలో అదృశ్యం

- ఆందోళనలో కుటుంబ సభ్యులు...

గన్నవరం పోలీసులకు ఫిర్యాదు


గన్నవరం : క్రైస్తవ మత కార్యక్రమాలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన పాస్టర్‌ అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు... స్థానిక హెచ్‌పి గ్యాస్‌ కంపెనీ సమీపంలో నివసిస్తున్న పాస్టర్‌ వీరపనేని జాన్సన్‌ చౌదరి (42) ది హోలీ గాడ్‌ మినిస్ట్రీస్‌ ఇండియా సంస్థకు ఫౌండర్‌, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఒడిశా రాష్ట్రాల్లో తన మినిస్ట్రీస్‌ ద్వారా క్రైస్తవ మత కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో చర్చి మినిస్ట్రీస్‌ ఆహ్వానం మేరకు అమెరికాలో జరిగే క్రైస్తవ మహా సభల్లో పాల్గొనేందుకు జాన్సన్‌చౌదరి జూన్‌ 14న హైద్రాబాద్‌ నుంచి విమానంలో వెళ్లారు. నెల రోజులపాటు అక్కడ ప్రార్ధన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన జులై 13న స్వదేశం తిరిగివస్తున్నట్లు భార్య సుభాషిణికి ఫోన్‌లో చెప్పారు. అయితే 13న జాన్సన్‌ రాలేదు. ఆమె పలుమార్లు ఫోన్‌ చేసినప్పికి జాన్సన్‌ అందుబాటులోకి రాకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాన్సన్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన అమెరికా నుంచి తిరిగి రాకపోవడంతో కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. అమెరికా వెళ్లాక తన భర్త ప్రతి రెండు మూడురోజుల కొకసారి తనతో ఫోన్‌లో మ్లాడేవారని సుభాషిణి తెలిపారు. ఆయన అమెరికాలో విమానం ఎక్కారో, లేదో సమాచారమివ్వాలని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయత్నించగా అధికారులు ఇవ్వట్లేదని వాపోయారు. ఇప్పికైనా ప్రభుత్వం స్పందించి తన భర్త ఆచూకీ కనుక్కోవాలని ఆమె విన్నవించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు