హైదరాబాద్

ఆధ్యాత్మిక వేత్తలూ హరిత సందేశమివ్వండి

హైద్రాబాద్‌ : ప్రజా ఉద్యమంలా నిర్వహించే హరితహారంలో ప్రజలను భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ క్రిస్టియన్‌, సిక్కు, పార్సీ, బౌద్ధ, జైన మతాల పెద్దలను, ఆధ్యాత్మిక గురువులను కోరారు. దర్గాలు, దేవాలయాలు, మందిరాలు, చర్చీలు, గురు ద్వారాలలో మొక్కలు నాలని కోరారు. ప్రభుత్వం పిలుపునకు స్పందించి సమావేశానికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. జులై12వ తేదీన సచివాలయంలో రాజీవ్‌శర్మ వివిధ మతాల పెద్దలతో విడివిడిగా సమావేశమయ్యారు. ప్రభుత్వ సలహాదారి రమణాచారి మ్లాడుతూ స్వామీజీల సందేశంతో ప్రజలందరు ఉత్తేజితులవుతారని అన్నారు. తమ వంతు సహకారం అందిస్తామని వివిధ మతాల పెద్దలు తెలిపారు. ఈ సమావేశంలో ముస్లిం మత పెద్దలు, హిందూ మత పెద్దలు, సిక్కు, జైను, పార్సి కమ్యూనిీ, బౌద్ధ మత పెద్దలు మరియు నేషనల్‌ క్రిస్టియన్‌ సెక్రటరీ ఎజెకియెల్‌, ఎల్‌.బి.నగర్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ సెక్రటరీ డా||కె.వి.ఎన్‌.జాకబ్‌, నారాయణగూడ బాప్టిస్ట్‌ చర్చ్‌కు చెందిన గోనెహా సాల్మన్‌ రాజ్‌లతో పాటు వివిధ చర్చిల పాస్టర్లు పాల్గొనగా ప్రభుత్వం తరపున ఎమ్మెల్సి స్టీఫెన్‌ సెబాస్టియన్‌, మైనారిీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్‌జలీల్‌, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండి విక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు