హైదరాబాద్

క్రైస్తవులకు ఇచ్చిన హామీలను సిఎం అమలు చేయాలి

కవాడిగూడ : ిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా, సిఎం కె.సి.ఆర్‌. క్రైస్తవులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణమని క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యకక్షుడు జెరుసలెం మత్తయ్య అన్నారు. క్రైస్తవులకు కె.సి.ఆర్‌. ఇచ్చిన హామీలు అయ్యేలా చూడాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. జులై 17వ తేదీన ఆయన విలేకరులతో మ్లాడుతూ కె.సి.ఆర్‌. క్రైస్తవులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆలిండియా దళిత క్రిస్టియన్‌ సంఘాల సమాఖ్య, క్రైస్తవ ధర్మప్రచార పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జులై 28వ తేదీన క్రైస్తవ హామీల జ్ఞాపకార్ధ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీ సికింద్రాబాద్‌ సెయ్‌ిం మేరి చర్చి, మదర్‌థెరిస్సా విగ్రహం, బోయిగూడ, లోయర్‌ ా్యంక్‌బండ్‌, అంబేద్కర్‌ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి అనంతరం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో భారీ జ్ఞాపకార్ధ సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభలో క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. క్రైస్తవులకు 3 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని, క్రైస్తవులకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని, క్రిస్టియన్‌ కార్పొరేషన్‌, మైనారిీ కమిషన్‌కు ఛైర్మన్‌ని నియమించాలని, క్రిస్టియన్‌ భవన నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌ పరిధిలో నాలుగు వైపులా క్రైస్తవుల సమాధులకు స్థలం కేయిస్తామని హామీ ఇచ్చారని, వాిని వెంటనే అమలు చేయాలన్నారు. ఈ జ్ఞాపకార్థ సభకు పది జిల్లాల క్రైస్తవులు, పాస్టర్లు, ఫెలోషిప్‌ నాయకులతో కలిసి ఒక్కరోజు ఉపవాస ప్రార్ధనలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు