విశాఖ

శోభాయమానం...చర్చి వార్షికోత్సవం

- లండన్‌ మిషన్‌ మెమోరియల్‌ చర్చి 211వ వార్షికోత్సవం - కోలాహలంగా ప్రార్ధన సమావేశం - ఇక్కడ సందేశమే అదృష్టమన్న బిషప్‌ రెవ.దైవాశీర్వాదం

అల్లిపురం :
నగరంలో ప్రాచీనమైన లండన్‌ మిషన్‌ మెమోరియల్‌ చర్చి 211వ వార్షికోత్సవం జులై 17వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రార్ధన సమావేశంలో కృష్ణ, గోదావరి జిల్లాల బిషప్‌, మోడరేటర్‌ రెవ.గోవాడ దైవాశీర్వాదం పాల్గొన్నారు. ముందుగా ఆరాధన చేప్టారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన మ్లాడుతూ 1805 జులై 18న విశాఖపట్నం, ౌన్‌ కొత్తరోడ్డులో లండన్‌ నగరానికి చెందిన జాన్‌ రినాల్డ్‌ చర్చిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్పి నుండి ఇప్పి వరకు నిరంతరం ఈ ప్రాంతంలో దేవుని ప్రార్ధనలు జరుగుతూ ఉండడంతో ఈ ప్రదేశం పవిత్ర పుణ్యక్షేత్రంగా మారిందన్నారు. అటువిం పవిత్ర ప్రదేశంలో తాను సందేశం ఇవ్వడంతో ఏసు ఆశీర్వాదం పొందిన అనుభూతి కలుగుతోందన్నారు. ఇక్కడ దైవ ప్రార్ధనలలో పాల్గొన్న భక్తులు ఏసుకు విశ్వాసపాత్రులైనట్టేనని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువిం పవిత్ర స్థలం మరొకి కానరాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి గౌరవాధ్యకక్షుడు ి.మోహనరావు, అధ్యకక్షుడు బి.చంథ్రేఖర్‌, కార్యదర్శి డిపికె కాటన్‌, కోశాధికారి ఎస్‌.నరేష్‌కుమార్‌ అధిక సంఖ్యలో భక్తులు ప్రార్ధనల్లో పాల్గొన్నారు.

చర్చి ఏర్పడి 211 ఏళ్లు : ౌన్‌ కొత్తరోడ్డు నుండి పాతపోస్టాఫీస్‌కు వెళ్లే దారిలో రోడ్డుకు కుడి పక్కగా కనిపించే లండన్‌ మిషన్‌ మెమోరియల్‌ చర్చికి ఘనమైన చరిత్ర ఉంది. 1794లో లండన్‌కు చెందిన జాన్‌ రినాల్డ్‌ నాయకత్వంలో లండన్‌ మిషన్‌ సొసౖీె ఏర్పడింది. ప్రముఖ మత ప్రచారకుడు విలియం క్యారీతో కలసి ఆయన మన దేశంలో పని చేశారు. ఆయన స్ఫూర్తితో రెవ.రింగిల్‌ ౌబే, రెవ.జార్జి క్రాస్‌, రెవ.అగస్టస్‌ డెస్‌ గ్రాన్జెస్‌ 1804లో భారతదేశానికి వచ్చారు. తర్వాత 1805, జులై 18న జార్జిక్రాన్‌, అగస్టస్‌ డెస్‌ గ్రాన్జెస్‌ విశాఖపట్నం వచ్చారు. అదే రోజు వారు వన్‌ౌన్‌ ప్రాంతంలో లండన్‌ మిషన్‌ మెమోరియల్‌ సంఘాన్ని ప్రారంభించారు. అప్పి నుండి 1808 వరకు వారిద్దరు తెలుగు నేర్చుకుని పరిశుద్ధ గ్రంధాన్ని అనువదించారు. దానిని 1818లో మద్రాసులో ముద్రించారు. ఆ గ్రంధం నెదర్లాండ్స్‌లో లభించింది. దానిని 2005లో విశాఖకు తీసుకువచ్చి లండన్‌ మిషన్‌ మెమోరియల్‌లో ఉంచారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు