రాష్ట్రీయం

రైలు చార్జీలు పెరిగాయి

రైల్వే శాఖ ప్రయాణికులపై మరికాస్త భారాన్ని వడ్డించడానికి సిద్ధమైంది. పెరిగిన చార్జీలు ఈ నెల 7 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా టిక్కెట్ ధరలను నిర్ణయించే.. 'ఫ్యూయల్ అడ్జస్ట్‌మెంట్ కాంపొనెంట్ (ఎఫ్ఏసీ) లింక్‌డ్ పాసింజర్ ఫేర్' పేరిట రైల్వే శాఖ ఈ అదనపు భారాన్ని వడ్డిస్తోంది. ఈ నెల 7 తర్వాత ప్రయాణాల నిమిత్తం ఇప్పటికే రిజర్వేషన్లు చేసేసుకున్నవారికి సైతం పెరిగిన చార్జీలు వర్తిస్తాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడల నుంచి కొన్ని ముఖ్య నగరాలు, పట్టణాలకు మధ్య ప్రయాణానికి సంబంధించి పెరిగిన ధరల మేరకు చార్జీలు ఇలా ఉన్నాయి.
ఇక రిజర్వేషన్ల ఫీజు వివరాలిలా ఉన్నాయి. మొదటి తరగతి ఏసీకి రూ. 60, రెండవ తరగతి ఏసీకి రూ. 50, మూడవ తరగతి ఏసీకి రూ.40, స్లీపర్ క్లాస్‌కు రూ.20. సూపర్‌ఫాస్ట్ రైళ్లలో అయితే.. ఫస్ట్‌క్లాస్ ఏసీకి రూ.75, సెకండ్ ఏసీకి రూ.45, థర్డ్ ఏసీకి రూ.45, స్లీపర్ క్లాస్‌కురూ.30 చొప్పున వసూలు చేస్తారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు