రాష్ట్రీయం

2013-10-13 నుండి ఇంటింటా సువార్త స్వర్ణోత్సవ వేడుకలు

హైదరాబాదు :- అక్టోబరు 13 నుండి 16వ తేదీ వరకు హయత్ నగర్ హైదరాబాదు వర్డ్ అండ్ డీడ్ ఇండియా హై స్కూల్ ప్రాంగణంలో ఇంటింటా సువార్త స్వర్ణోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 దేశముల నుండి ఇంటింటా సువార్త అంతర్జాతీయ నాయకులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 5000 మంది ప్రతినిధులు హాజరౌతున్నారు. 1964సం॥నుంచి 2014 ఏప్రిల్ నాటికి మన భారతదేశంలో ఇంటింటా సువార్త ప్రారంభించబడి 50 సంవత్సరములు పూర్తి అయిన సందర్భముగా ఈ నెల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ 50 సం॥ల కాలంలో ఇంటింటా సువార్త సేవలో ప్రభువు ఎన్నో మహోన్నతమైన అద్భుత కార్యములను జరిగించాడు. ఈ 50 సం॥ల కాలంలో దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లాలోని, నగరాలు, పట్టణాలు, మండలాలు, మండలాలలోని గ్రామాలు, గ్రామాలలోని ప్రతి ఇంటిని దర్శించి క్రీస్తు శుభవార్త సందేశాన్ని వారికి అందించుటకు ప్రభువు తన మహాకృపను చూపాడు. సువార్త ప్రకటన, ఆత్మల సంపాదన, క్రీస్తు శిష్యబృందాల స్థాపన, ఉజ్జీవసభల నిర్వహణ, ప్రార్ధనా పాఠశాలల నిర్వహణ, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, నగరాలు మహా నగరాలలో సువార్త దండయాత్రలు, ఆలయ నిర్మాణాలు, ప్రకృతి వైపరిత్యాల సమయాలలో సహాయక కార్యక్రమాలు, వైద్య శిబిరాలు వంటివి ఎన్నో ఎన్నెన్నో ఈ 50 సం॥ల కాలంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ స్వర్ణోత్సవ వేళ ఇంటింటా సువార్త చరిత్ర అధ్యాయాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించగలిగే ఇన్ని సేవా కార్యక్రమాలు రూపొందించబడి విజయవంతంగా పూర్తిచేయబడడానికి మీ అందరి ప్రార్ధనలు అందించిన సహాయ సహకారాలే కారణం అని రెవ.డా॥యం.యం. ప్రసాద్ ఇంటింటా సువార్త విజ్ఞాపన పత్రికలలో తెలియజేసారు.  


 తాజా వీడియోలు 
తాజా వార్తలు