గుంటూరు

చర్చికి వెళ్తుండగా కారు ఢీకొని...

తెనాలి : కారు ఢీకొన్న ప్రమాదంలో నేలటూరి శారమ్మ (80) అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు త్రి ౌన్‌ పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం స్థానిక ఇందిరా కాలనీకి చెందిన శారమ్మ ప్రతి ఆదివారం చెంచుపేట మెయిన్‌ రోడ్డులోని ఆర్‌.సి.ఎం.చర్చికి వెళ్తుంది. ఎప్పిలాగే జులై 3వ తేదీన చర్చికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా సుల్తానాబాద్‌ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న త్రి ౌన్‌ పిఎస్‌ఐ హాజరత్తయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి సందర్శించి పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు