గుంటూరు

జులై 31 నుంచి ఎఇఎల్‌సి ఆవిర్భావ వేడుకలు

గుంటూరు : ఆంధ్రా ఇవాంజికల్‌ లూధరన్‌ చర్చి 175వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జులై 31 నుంచి, 2017 జులై 31 వరకు సువార్త ఉద్యమం పేరుతో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఎఇఎల్‌సి మోడర్‌ే బిషప్‌ రెవ.డా||పరదేశిబాబు చెప్పారు. బ్రాడీపేటలోని ఎఇఎల్‌సి కార్యాలయంలో జులై 5వ తేదీన సమావేశం నిర్వహించారు. జులై 30న గుంట గ్రౌండ్స్‌లో ప్రారంభ వేడుకలు నిర్వహిస్తామని పరదేశిబాబు తెలిపారు. ఉత్సవ కమిీలను నియమిస్తామన్నారు. ఎఇఎల్‌సిను గురించి తెలియజెప్పే ఫొో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సమావేశంలో ప్రేమ్‌కుమార్‌, కార్యదర్శి చిన్నం కిశోర్‌బాబు, ఎసి కళాశాల ప్రిన్సిపల్‌ ముత్యం, ప్రొఫెసర్‌ లాం ప్రకాష్‌, మాత్యు, పాస్టర్లు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు