విశాఖ

కుక్కకో చిప్పు

 - 666 మార్గం సరళం చేస్తున్నారా?

- ఇప్పుడు కుక్కలకి, తరువాత మనుషులకా?

విశాఖపట్నం :
శునకాల స్వైర విహారాన్ని, వాి పట్ల యజమానుల నిర్లక్ష్య ధోరణిని నియంత్రించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖపట్నం అధికార యంత్రాంగం ఓ వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న విశాఖలో జులై 6 నుంచి పెంపుడు కుక్కలకు మైక్రోచిప్‌ లైసెన్సింగ్‌ విధానాన్ని అధికారులు అమలు చేయనున్నారు. దీని ప్రకారం ఆగస్టు 6 లోగా శునకాలకు బియ్యపు గింజ పరిమాణంలో ఉండే నిర్దేశిత మైక్రోచిప్‌ను అమర్చుకోకపోతే, యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు. విశాఖ మహానగర పాలక సంస్థ (జివిఎంసి) పరిధిలోని అన్ని జివిఎంసి వెటర్నరీ డిస్పెన్సరీలు, జోనల్‌ కార్యాలయాలు, పెంపుడు జంతువులను అమ్మే ప్రముఖ దుకాణాల వద్ద ఒక ప్రత్యేక ఇంజెక్షన్‌తో కుక్కలకు ఈ చిప్‌ను చొప్పించనున్నారు. ఇందుకోసం యజమానులు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చిప్‌ను చొప్పించాక అధికారులు లైసెన్స్‌ కార్డును ఇస్తారు. దీని కాలపరిమితి కుక్క జీవిత కాలంపాటు ఉంటుంది. చిప్‌ను కుక్క మెడభాగంలో అమర్చుతామని, ఇది జీవితాంతం చర్మంలో ఇమిడి ఉంటుందని, కుక్క ఆరోగ్యంపై ఎలాిం ప్రభావాన్నీ చూపదని జివిఎంసి ప్రజారోగ్య విభాగం అధికారి ఎస్‌.జయరామ్‌ న్యూస్‌టుడేతో చెప్పారు.

చిప్‌ ఏర్పాటుతో ప్రయోజనాలు ... స్కానింగ్‌ పరికరంతో కుక్కను, దాని వివరాలను సిబ్బంది సులభంగా గుర్తించవచ్చు.

  - కుక్క తప్పిపోతే జిపిఎస్‌ సాయంతో ఎక్కడున్నా గుర్తు ప్టొచ్చు.

- పెంపుడు కుక్కలను యజమానులు నిర్లక్ష్యంగా రోడ్లపై విడిచిపెట్టడానికి వీలుండదు.

ముందుగానే మనకి 666 ముద్ర గురించి తెల్సిందే. ఇప్పుడున్న టెక్నాలజీని బ్టి ఒక మైక్రోచిప్‌ని మన శరీరంలో అమరుస్తారని థియోలజిస్ట్‌ చెప్తున్నారు.

వైజాగ్‌లో పెంపుడు కుక్కలకు మైక్రోచిప్‌ లైసెన్సింగ్‌ విధానాన్ని అక్కడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రవేశప్టిెంది. ఇది బియ్యపుగింజ ఆకారంలో ఉంటుంది. దీన్ని కుక్క యొక్క మెడ భాగంలో అమర్చుతారు. ఈ చిప్‌ని స్కాన్‌ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ వచ్చేస్తాయి. అంతేకాకుండా కుక్క తప్పిపోకుండా జి.పి.ఎస్‌.ాకింగ్‌ సిస్టమ్‌ కూడా ఉంటుంది. ఈ టెక్నాలజిని ఇంకా అభివృద్ధి చేసి మనుషులకు అమర్చే అవకాశం ఉంది. ఇది ఎక్కడో వేరే దేశంలో కాదు, మన వైజాగ్‌లోనే. కాలం ఆసన్నమైంది ఇంక ఎంతో టైమ్‌ లేదు అనానికి ఇది ఒక నిదర్శనం.

నా ప్రియ సోదర, సోదరీమణులారా! ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనకరం ఉండదు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు