జాతీయం

క్రైస్తవ పర్సనల్‌ లాపై న్యాయ పరిశీలన

ఢిల్లీ : క్రిస్టియన్‌ పర్సనల్‌ లా కింద జారీచేసిన విడాకులు భారతీయ చ్టాల ప్రకారం చెల్లుబాటు అవుతాయా? అనేది పరిశీలించేందుకు సుప్రీంకోర్టు జులై 4వ తేదీన             అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ి.ఎస్‌.ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఈ పిషన్‌ను విచారిస్తున్నది. కర్ణాటక క్యాథలిక్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యకక్షుడు క్లారెన్స్‌ పాయస్‌ ఈ పిషన్‌ దాఖలు చేశారు. మూడుసార్లు తలాఖ్‌ చెప్తే ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం విడాకులు చెల్లుబడి అవుతున్నాయని, అప్పుడు క్రైస్తవ మత నిబంధనల ప్రకారం మత న్యాయస్థానాలు జారీచేసే విడాకులు కూడా చెల్లుబడి అవుతాయని తీర్పు చెప్పాలని పిషనర్‌ కోరారు. ఆయన తరపున మాజీ అార్నీ జనరల్‌ సోలీ సొరాబ్జీ కోర్టుకు వాదనలు వినిపించారు. ముస్లిం పర్సనల్‌ లా చెల్లుబడి అయినప్పుడు క్రైస్తవ పర్సనల్‌ లా ఎందుకు చెల్లుబడి కాదనేది పిషనర్‌ ప్రధానమైన ప్రశ్నించడం గమనార్హం.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు