మెదక్

సీఎస్‌ఐ ఆవిర్భావ వేడుకలు

మెదక్ : మనిషి మనిషిని ప్రేమించాలనే ప్రభువు చూపిన బాటలో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని చర్చి ఆఫ్ సౌత్ ఇండియా(సీఎస్‌ఐ) డిప్యూటీ మోడరేటర్, మెదక్ డయాసిస్ ఇన్‌చార్జి బిషప్ రైట్.రెవరెండ్ డాక్టర్ దైవాశీర్వాదం పిలుపునిచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ మహాదేవాలయంలో దక్షిణ ఇండియా సంఘం(సీఎస్‌ఐ) 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

  ఈ వేడుకలకు డయాసిస్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహరాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా మహాదేవాలయంలో క్రైస్తవ సోదరులనుద్దేశించి దైవాశీర్వాదం  దైవసందేశం అంది స్తూ ప్రతి మానవుడు చేసే గొప్పకార్యంలో దేవుని కృప తప్పకుండా ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ సేవాదృక్పథం కలిగి ఉండాలన్నారు. స్త్రీల మైత్రి సమాఖ్య 65యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్త్రీలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకతీతంగా ఈ ఆరాధనలో భక్తులు పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని, ప్రతి మనిషి తన జీవితాన్ని కృతజ్ఞతపూర్వకంగా దేవునికి అర్పించాలన్నారు. మనిషిని మనిషి ప్రేమించాలని, ఆ ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించడమే ప్రతి ైక్రెస్తవుని లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తోటి వారి పట్ల ప్రేమ, దయ, జాలి, కరుణ కలిగి ఉండాలన్నారు. క్రైస్తవ సోదరులు, మహిళలతో మహాదేవాలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలపించిన దేవుని గీతాలు అందర్నీ అలరించాయి. ఈ సందర్భంగా చర్చి ఆఫ్ సౌత్ ఇం డియా జెండాను, మెదక్ డయాసిస్ జెండాలను దైవాశీర్వాదం ఆవిష్కరించారు. అనంతరం చర్చి ప్ర ధానం ద్వారం నుంచి పట్టణంలోని ప్రధాన తపాల కార్యాలయం వరకు నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

 ఈ సందర్భంగా చర్చి కాంపౌండ్‌లో ఉన్న గ్రామీణ పాలిటెక్నిక్ సెంటర్‌ను దైవాశీర్వాదం పునః ప్రారంభించారు. చర్చి ప్రెసిబెటరి ఇన్‌చార్జి రెవరెండ్ వై. రాబిన్‌సన్ అధ్యక్షతన ఆవిర్భావ వేడుకలు కొనసాగాయి. వేడుకల సందర్భంగా పట్టణ సీఐ విజయ్‌కు నేతృత్వంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ వేడుకల్లో  సీఎస్‌ఐ స్త్రీల మైత్రి సం ఘం అధ్యక్షులు రమణిదైవాశీర్వాదం, సీఎస్‌ఐ అడ్మినిస్ట్రేటీవ్ సెక్రెటరి పాల్‌రాజ్, ఫైనాన్సియల్ అడ్వయిజర్ జోనాథన్ ధర్మరాజ్, రీజినల్ ఉమెన్ సెక్రెటరి కుముథిని ధర్మరాజ్, అడ్మినిస్ట్రేటీవ్ కమిటీ సభ్యులు విల్సన్, గెలెన్, సాలమన్, రోలాండ్‌పాల్, జేమ్స్ సూర్య, డయానియల్, చర్చ్ అసిస్టెంట్ ప్రెసిబెటరి ఇన్‌చార్జి విజయ్‌కుమార్, జాన్‌పీటర్, కరుణాకర్, మెదక్ కెథడ్రల్ సభ్యులు శాంతకుమార్, స్టివేన్, సుహన్, వికాస్ తదితరులు ఉన్నారు. 


 తాజా వీడియోలు 
తాజా వార్తలు